సాదారణంగా మనం కంప్యూటర్లో డేటాని ఒక డ్రైవ్ లో నుండి మరొక డ్రైవ్ లోకి కాపీ చేస్తుంటాము అయితే ఆ కాపీ జరిగే సమయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు మనం చెప్పే ఈ టెక్నిక్ లో కేవలం నిమిషాల వ్యవధిలోనే మన కంప్యూటర్ లో ఉన్న డేటాను ఒక డ్రైవ్లో నుండి మరొక డ్రైవ్ లోకి లేదా పెన్ డ్రైవ్ లోకి లేదా నెట్వర్క్ డ్రైవ్ లోకి చాల సులభంగా కాపీ చేసుకోవచ్చు

ఈ క్రింది టెక్నిక్ వాడినట్లయితే తక్కువ సమయంలో మీరు డేటాను మరోక స్థానంలోకి మార్చుకోవచ్చు.
మెదటగా మీ కీ బోర్డులో Windows + R కీ ని ప్రెస్ చెయ్యండి అక్కడ మీకు ఒక్క కమాండ్ బాక్స్ వస్తుంది ఈ విధంగా దానిలో CMD అని టైప్ చెయ్యండి.


తరువాత మీకు ఇలా ఒక బ్లాకు స్క్రీన్ తో ఒక విండో ఓపెన్ అవుతుంది దానిలో ఇక్కడ చెప్పిన విధంగా మీరు టైపు చెయ్యండి.





ఇలా స్క్రీన్ ఓపెన్ అయిన తరువాత అక్కడ robocopy అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి తరువాత మీ ఫోల్డర్ లొకేషన్ తరువాత మీ డెస్టినేషన్ లొకేషన్ ఇవ్వండి అంటే ఎక్కడ నుండి ఎక్కడికి కాపీ చెయ్యాలి అనీ ఇచ్చి తరువాత ఇక్కడ చెప్పిన విధంగా టైప్ చెయ్యండి /MT /e అని వ్రాయాలి
ఉదా : robocopy "C:\Users\JMR_Desk\Desktop" "D:\Test Folder" /MT /e
ఈ విధంగా చేసినట్లయితే మీరు మీ డేటాను త్వరితగతిన ఒక లొకేషన్ లో నుండి మరొక లొకేషన్ లోకి కాపీ చేసుకోవచ్చు . 

ధన్యవాదములు

పూర్తి వివరాలు కోసం ఈ వీడియో ను వీక్షించండి.